Bithiri Sathi Comments On Anchor Sreemukhi became hot topic
#bithirisathi
#anchorsrimukhi
#diksuchimovieaudiolaunch
#Aali
#SumaKanakala
ప్రస్తుతం చిన్న విషయాన్ని కూడా హాట్ టాపిక్ గా మార్చేస్తున్నాయి కొన్ని మీడియా సంస్థలు. ఎన్నో సమస్యలని పక్కన పెట్టేసి చిన్న విన్న వివాదసంఘటనలపై డిబేట్లు పెడుతూ సంచలనమైన వార్త అంటూ చూపిస్తున్నాయి.తాజాగా అలాంటి పరిస్థితులే నెలకొని ఉన్నాయి. నటుడు, యాంకర్ అయిన బిత్తిరి సత్తి ఎంత సరదాగా ఉంటాడో అందరికి తెలిసిందే. ఓ ఛానల్ లో వచ్చే అతడి షోకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇప్పుడిప్పుడే బిత్తిరి సత్తి నటుడిగా కూడా రాణిస్తున్నాడు. ఇటీవల దిక్సూచి ఆడియో వేడుకలో బిత్తిరి సత్తి శ్రీముఖిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై కొన్ని మీడియా సంస్థల్లో డిబేట్లు జరుగుతున్నాయి. వాస్తవానికి సత్తి కామెంట్స్ ని శ్రీముఖి సరదాగానే తీసుకుంది.